ఒడిషా రాష్ట్రంలోని టాటా నగర్‌కు చెందిన బాదల్ మండల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఢిల్లీలోని సైదులాజైబ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈయనకు విపిన్ జోషి అనే స్నేహితుడు ఉన్నాడు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. దీంతో మండల్ ఇంటికి జోషి వస్తూపోయేవాడు. ఈ క్రమంలో మండల్ భార్యతో జోషికి వివాహేతర సంబంధం ఏర్పడింది.