ఇక అనసూయ తన యాంకర్ వృత్తిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అదే ఆమెకు సినిమాలలో అవకాశాలు కలిగేలా చేసింది. ఇక్కడే కాకుండా దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఆమె తాజాగా అల్లు అర్జున్ `పుష్ప`లో నటించింది. అయితే టీవీ షోలో గ్లామర్ తగ్గించుకోమని ఓ వ్యక్తి అగడడంతో అది షోలో వైలర్ కావడంతో అప్పటినుంచి తను వస్త్రధారణలో కాస్త జాగ్రత్త పాటిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు.