హీరోయిన్ల కొరత.. శ్రీయాతో సరిపెట్టుకుంటున్న హీరోలు..! చేతిలో మూడు సినిమాలు!

ఆదివారం, 5 జూన్ 2016 (17:11 IST)
సినిమా అవకాశాల కోసం సీనియర్ హీరోయిన్లు బాగా వళ్లు తగ్గించి ప్రయోగాలు చేస్తున్నారు. శరీరాకృతి మార్చుకుని కురుచ దుస్తులు వేసుకుని తెగ హంగామా చేస్తున్నారు. ఇందుకోసం అవార్డుల కార్యక్రమాలకు, ఆడియో ఫంక్షన్లకు హాజరవుతున్నారు. కానీ వారిని అదేపనిగా నోరెళ్లబెట్టుకుని చూసే దర్శకనిర్మాతలు ఛాన్సులు ఇవ్వడంలో మాత్రం అంత ఆసక్తి చూపట్లేదు. 
 
అయినా కొత్త సినిమా అవకాశం ఎప్పుడొస్తుందా అని సీనియర్ హీరోయిన్లు అని పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలకు హీరోయిన్ల కొరత ఎక్కువైంది. దాంతో యంగ్ హీరోయిన్ల కోసం ఎగబడే సీనియర్ హీరోలు.. వాళ్లు బిజీ కాల్షీట్ల కారణంగా ఇక లాభం లేదనుకు శ్రీయ లాంటి హీరోయిన్స్‌‍తో సరిపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీయ మూడు సినిమా ఛాన్సులను సొంతం చేసుకుందని.. త్వరలోనే ఆ సినిమా వివరాలు సైతం వెల్లడి కానున్నాయని చెప్తోంది. 

వెబ్దునియా పై చదవండి