ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ రావడంపై పలువురు పలురకాలుగా స్పందించారు. ఇక అందులో నటించిన శ్రియాశరణ్ మరింత ఆనందం వ్యక్తంచేసింది. సోమవారంనాడు ఆమె నటించిన కబ్జా సినిమా ప్రమోషన్ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో ఆమె పాల్గొంది. అదేవేదికపై వున్న ఉపేంద్ర కూడా మాట్లాడుతూ, గ్రేట్ దర్శకుడు రాజమౌళి, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిగారు ఆధ్వర్యంలో ఇండియాలోనే నాటునాటు సాంగ్ సెస్సేషనల్ చేశారు. ఎన్.టి.ఆర్., రామ్‌చరణ్ ఇద్దరూ డాన్స్ చేస్తే ఇండియానే డాన్స్ చేసింది.