దాపరికాలు ఉండవ్ ... అన్నీ ఓపెన్ టైప్ ... అలా చేయించుకుంటే తప్పేంటి?

ఆదివారం, 2 ఆగస్టు 2020 (08:40 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. తండ్రి ఇమేజ్‌తో మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత తన టాలెంట్‌తో ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ కుర్రోడితో ప్రేమలో పడి, కెరీర్‌ నాశనం చేసుకుంది. ఇపుడు తన వద్దకు వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. 
 
ఈ క్రమంలో ఆమె ముఖాకృతి కోసం పలు రకాలైన ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుంది. అయితే ఈ విషయాల్లో చాలా మంది గోప్యత పాటిస్తారు. ఎటువంటి సందర్భంలోనూ సర్జరీల గురించి చెప్పడానికి ఇష్టపడరు. కానీ, ఈ చెన్నై సోయగం శృతిహాసన్‌ మాత్రం తనకు అలాంటి దాపరికాలు లేవని చెబుతోంది. ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం తప్పేమి కాదంటోంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'ఎవరి ముఖాలైన అంత త్వరగా మారిపోవు. ఒక్కసారిగా పెద్ద మార్పు కనిపిస్తోందంటే సర్జరీ చేయించుకున్నట్లే అనుకోవాలి. జుట్టుకు రంగు వేసుకోవడం, కళ్లకు కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకోవడం, చర్మానికి బ్లీచింగ్‌ మాదిరిగానే ప్లాస్టిక్‌ సర్జరీ కూడా సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఓ మార్గం. తన శరీరానికి సంబంధించిన ప్రతి నిర్ణయాల్ని స్వేచ్ఛగా తీసుకునే హక్కు మహిళలకు ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది. 
 
మొదటి సినిమా చిత్రీకరణ సమయంలో ముక్కుకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నానని, ఆ విషయం గురించి అందరికి చెప్పానని శృతిహాసన్‌ పేర్కొంది. సెలబ్రిటీలు కావడం వల్లే చాలా మంది ఇలాంటి విషయాల్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరని, కానీ, నా వద్ద ఎలాంటి దాపరికాలు ఉండవన్నాు. పైగా, ఒకరు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల పట్ల విమర్శలు చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు