నటి శ్వేతబసు ప్రసాద్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. కొత్తబంగారులోకం, కళావర్ కింగ్, రైడ్, కాస్కో వంటి సినిమాల్లో నటించిన శ్వేత కొన్ని ఒడిదుడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా మీడియా ద్వారా తెలిపారు.