బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో, సిద్ధు, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ మూమెంట్, మరో సైడ్ రాశి ఖన్నా నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించారు. పోస్టర్ ఇద్దరు అమ్మాయిలతో హీరో ప్రేమకథను ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష