వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఠాగూర్

ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (17:47 IST)
గత 2019 ఎన్నికలకు ముందు వైకాపాకు పాటలు పడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని సింగర్ మంగ్లీ అంటున్నారు. అయితే, 2024లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి పాటలు పాడలేదని చెప్పారు. కేవలం వైకాపాకు మాత్రమే పాటలు పాడలేదనీ అన్ని పార్టీల లీడర్లకు కూడా పాటలు పాడానని తెలిపారు. వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
తాను చంద్రబాబుకు పాట పాడానన్నది అవాస్తమన్నారు. రాజకీయ లబ్దికోసం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవన్నారు. ఏ పార్టీకి తాను ప్రచారకర్తను కాదని స్పష్టంచేశారు. తనకు పాటే ముఖ్యమని తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే, ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అరసవల్లి దేవాలయానికి మంగ్లీ వెళ్లారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించి, ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మంగ్లీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు తనను సంప్రదిస్తే పాట పాడానని అన్నారు. పాటలు పాడానే తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్కమాట అనలేదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు