ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Video)

బుధవారం, 5 ఆగస్టు 2020 (14:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు.
 
తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలైయిమేడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ కోరల్లో చిక్కగా, ఆ తర్వాత ప్రముఖ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత మరో డైరెక్టర్ తేజ, పాప్ సింగర్ స్మిత, ఇపుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలు ఈ వైరస్ బారినపడ్డారు.

 

Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing well. Wishing him speedy recovery. pic.twitter.com/ZK4MGkfRxQ

— BARaju (@baraju_SuperHit) August 5, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు