ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా హిర మండలం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఈ యేడాది ఫిబ్రవరి నెలలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇపుడు నెలకు రూ.50 కోట్ల చొప్పున తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారంటూ కామెంట్స్ చేశారు.