యాంకర్లు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తుంటారు. అలా చూపించినప్పుడు తమ నోటి వెంట తప్పు పదాలు దొర్లిపోతాయి. ఒక్కసారి నోటి నుంచి ఆ పలుకు అడ్డదిడ్డంగా వచ్చేస్తే ఇక వెనక్కి తీసుకోలేం కదా. అది అలా నిలిచిపోతుంది. యాంకర్ ఝాన్సీ కూడా అలాంటి తప్పిదమే ఒకటి చేశారు. విషయం ఏంటయా అంటే... ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాసుకు తిరుపతిలో సన్మాన కార్యక్రమం జరిగింది.