Dhanush, Samyukta Meno, adi and team
తాజాగా విడుదలైన 'సార్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై కథానాయకుడు సాగించే పోరాటమే 'సార్'. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున కొన్ని ప్రభుత్వ కళాశాలను దత్తతు తీసుకుంటారు. అక్కడికి ఫ్యాకల్టీగా కథానాయుడు వెళ్తాడు. హాస్యం, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతున్న కథలో.. కొందరి స్వార్థం కారణంగా పేద విద్యార్థులకు చదువు దూరమయ్యేలా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ విద్యార్థుల తరపున సార్ ఎలా పోరాటం సాగించాడో అనే ఆసక్తిని రేకిత్తిస్తూ రూపొందిన ట్రైలర్ మెప్పిస్తోంది. "చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం మీరు ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు", "ఎడ్యుకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు", "డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు..కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది" వంటి సంభాషణలు కథానుసారం బలంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడి అద్భుతమైన సృష్టికి జె. యువరాజ్ కెమెరా పనితనం, జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడై ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.