ఇటీవల సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ భార్య, సినీనటి నమ్రత.. పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానులను అబ్బుర పరుస్తోంది.
నిద్రపోయే ముందు తన తండ్రికి కబుర్లు చెబుతూ, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, నవ్వుతూ సితార కనపడుతోంది. ఆమె చెబుతోన్న విశేషాలను వింటూ మహేశ్ బాబు కూడా చిరునవ్వులు చిందించాడు. ఈ ఫోటోకు మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.