దిమ్మతిరిగే స్టెప్పులతో థ్రిల్స్‌కు గురిచేస్తున్న స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (12:01 IST)
గతంలో ప్రతి ఒక్కరిలో దాగివున్న ప్రతిభను వెలికి చెప్పాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. కానీ, ఇపుడు ట్రెండ్ మారిపోయింది. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. 
 
తాజాగా న‌లుగురు స‌భ్యులు స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ చిత్రంలోని ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మ‌తిరిగే స్టెప్పులు వేశారు. స్టెప్స్ అర్థంకాక ప‌దేప‌దే ఆ వీడియోని చూసిన నెటిజన్స్ థ్రిల్‌కి గుర‌వుతున్నారు. 
 
ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుండ‌గా, బాలీవుడ్ యాక్ట‌ర్ శృతి సేత్‌, టీవీ ప‌ర్స‌నాలిటీ గౌర‌వ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పుల‌కి ఫిదా అయ్యారు. 3.9 ల‌క్ష‌ల‌కి పైగా నెటిజ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోని చూడ‌గా, 16000కి పైగా లైక్ చేశారు. 4700 మంది రీ ట్వీట్ చేశారు.

 

I bet u will watch it again and again after watching the last frame! pic.twitter.com/53jCcUA8pH

— Prabhasini (@cinnabar_dust) February 16, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు