బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం కఠినమైన పరీక్ష... అందులో గెలిచిందెవరు? (video)

బుధవారం, 21 ఆగస్టు 2019 (16:35 IST)
బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు రియాలిటీ షో విజయవంతంగా 30 రోజులు ముగించుకుంది. నామినేషన్లు, చిన్న చిన్న గొడవలు, కోపాలు, సర్దుబాట్లతో 29, 30వ రోజు చాలా ఆసక్తికరంగా సాగాయి.

ఆపై వరుణ్ సందేశ్, వితిక పెళ్లి రోజును ఇంటి సభ్యులంతా కలిసి ఘనంగా నిర్వహించారు, అంతేకాకుండా వారిని మంచి మనస్సుతో ఆశీర్వదించారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే..
 
తదుపరి వారానికి సంబంధించిన ఇంటి కెప్టెన్సీ పోటీగా బిగ్ బాస్ నీదా పంతం.. నాదా పంతం అనే టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనాల్సిన సభ్యుల ఎంపిక కోసం ముందు ఓ పోటీని నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేయాలని నిర్ణయించిన బిగ్ బాస్ ఇంటిలో బెల్ మోగగానే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి, సీటుపై ఏ ఇద్దరు ముందుగా కూర్చుని ఉంటారో వారే పోటీదారులని తెలిపారు. అలా నిర్వహించిన పోటీలో శివజ్యోతి, వితిక గెలిచారు.
 
ఆ తర్వాత కెప్టెన్ పోటీదారులకు నిర్వహించిన టాస్క్‌లో వితిక, శివజ్యోతి పాల్గొన్నారు. ఇంటిలో ఓ క్రేన్‌ను వేలాడదీసి, వాటికి ఉన్న వైర్స్‌కు శివజ్యోతి, వితికను బంధించి పై నుండి వేలాడదీశాడు. ఎక్కువ సేపు ఎవరైతే వేలాడుతూ ఉంటారో వారు ఇంటి కెప్టెన్‌గా ఎన్నికవుతారు.

ఈ పోటీ నుంచి వితిక బాడీ పెయిన్స్ కారణంగా తప్పుకోవడంతో శివజ్యోతి కెప్టెన్‌గా ఎంపికైంది. కెప్టెన్‌గా ఎంపికైన శుభసందర్భంలో ఆమె తనకి మద్దతు అందించినవారికి ధన్యవాదాలు తెలిపింది. ఇంకేంటి వచ్చేవారం కూడా శివజ్యోతి నామినేషన్ నుండి తప్పించుకునే సదవకాశాన్ని కొట్టేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు