శివ కార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను... అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్‌రాజు. 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం `రెమో`. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం `రెమో`ను తెలుగులో నవంబర్ 24న విడుదల చేశారు. భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకుడు. సినిమా హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తున్న సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, శివకార్తీకేయన్, కీర్తి సురేష్, పి.సి.శ్రీరాం, అనిరుధ్, డైలాగ్ రైటర్ రాజేష్, శ్రీమణి, సతీష్ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్‌పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంతకుముందు నేను తమిళంలో వచ్చిన వైశాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేశాను. వైశాలి మంచి సక్సెస్ సాధించింది. అలాగే మణిరత్నంగారి ఓకే బంగారం సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తే అది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు అలాగే తమిళంలో పెద్ద హిట్ అయిన రెమో సినిమా తెలుగులో విడుదల చేశాను. తెలుగు ప్రేక్షకులు నా నమ్మకాన్ని నిలబెడుతూ సినిమాను సక్సెస్ చేశారు.
శివకార్తీకేయన్ నటనకు తమిళంలో ఈ సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో తెలుగులో కూడా అంతే మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. రాజేష్ సినిమాకు మంచి సంభాషణలు రాస్తే, శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా నిర్మా ఆర్. రాజా సినిమాను తెలుగులోకి విడుదల చేయడానికి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రాజాగారికి కూడా కంగ్రాట్స్ అని దిల్ రాజు అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా టీజర్, సాంగ్స్ బావున్నాయని అభినందించారు. సినిమా కూడా చూస్తానని అన్నారు. ఆయనకు థాంక్స్. నిన్న ఓ థియేటర్‌లో వెళ్లి ఆడియెన్స్ మధ్య రెమో సినిమా చూశాను. సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో అనువాదమై, పెద్ద రేంజ్‌లో విడుదలైన సినిమా రెమో నాకు మంచి డెబ్యూ మూవీ అయ్యింది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. దిల్‌రాజు ఈ చిత్రంతో తెలుగులో నాకు మంచి ప్లాట్‌ఫాం ఇచ్చారు. ఈ సందర్భంగా దిల్‌రాజుగారికి, నిర్మాత రాజాకు ధన్యవాదాల అని హీరో శివకార్తికేయన్ అన్నారు.