పరోటా సూరికి సీఐడీ సమన్లు.. విష్ణు విశాల్‌ తండ్రిపై ఫిర్యాదు చేయడంతో?

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:18 IST)
Soori
కోలీవుడ్ కామెడీ నటుడు సూరికి పరోటా సూరి అనే పేరు కూడా వుంది. ఓ సినిమాలో 30కి పైగా పరోటాలను తింటానని పందెం కాసిన సన్నివేశంలో నటించడంతో అతనికి పరోటా సూరి అనే పేరు వచ్చింది. ఇప్పటికే కామెడీ హీరోగా అదరగొట్టిన సూరి.. సినిమాల్లో మంచి గుర్తింపును సాధిస్తున్న వేళ.. అపవాదును తనపై వేసుకున్నాడు. 
 
భూమిని కొనుగోలు విషయంలో మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన నటుడు సూరికి కేంద్ర నేర పరిశోధన విభాగం (సిఐడి) సమన్లు ​​జారీ చేసింది. నటుడు విష్ణు విశాల్ తండ్రి, నిర్మాత రమేష్ ఈ భూమిని రూ. 2.70 కోట్ల రూపాయల మోసం చేశారనే ఆరోపణలతో నటుడు సూరి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి నటుడు విష్ణు విశాల్ తండ్రి రమేష్, అన్బువేల్ రాజన్‌లపై కేసు నమోదు చేశారు.
 
అయితే సూరి ఫిర్యాదులో నిజం లేదని నటుడు విష్ణు విశాల్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. చిత్ర నిర్మాణ సంస్థకు సూరి డబ్బు చెల్లించాల్సి ఉందని విష్ణు విశాల్ తెలిపారు. సూరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విష్ణు విశాల్ తెలిపారు. సూరి ఫిర్యాదుపై చింతిస్తున్నానని చెప్పారు. ఈ కేసులో, నటుడిని సెంట్రల్ క్రైమ్ డివిజన్ పోలీసులు సూరిని విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు