VJ Sunny,Hritika Srinivas, Jaya Shankar
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా బిగ్ బాస్ - 5, టైటిల్ విన్నర్, వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం సౌండ్ పార్టీ. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ సంజయ్ శేరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సారథి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను జర్నలిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.