రారా సామికి స్టెప్పులేసిన స్పైడర్ మ్యాన్.. వీడియో వైరల్

సోమవారం, 10 జనవరి 2022 (11:13 IST)
spider man
పుష్ప నుండి "రారా సామి"కి నృత్యం చేస్తూ స్పైడర్ మాన్ తన విజయాన్ని జరుపుకుంటున్నాడు. ఇదేంటి అనుకుంటున్నారా..? అయితే చదవండి. 'పుష్ప' భారీ విజయాన్ని జరుపుకుంటున్న అల్లు అర్జున్ 'సామి సామి' పాటకు స్పైడర్ మ్యాన్ కాలు కదిపాడు. అల్లు అర్జున్, రష్మిక మందనల పుష్ప: ది రైజ్‌కు క్రేజ్ అంతాఇంతా కాదు.
 
ప్రస్తుతం ఈ సినిమా భారీ సక్సెస్‌కు సంబంధించి ఒక వైరల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి స్పైడర్ మాన్‌గా దుస్తులు ధరించి.. సామి సామి పాటకు చిందులేస్తూ.. పుష్ప సక్సెస్‌ను ఆస్వాదించాడు.  
 
అల్లు శిరీష్, తన సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా అతను ట్వీట్ చేస్తూ, "స్పైడర్ మాన్ తన విజయాన్ని పుష్ప నుండి "రారా సామి"కి నృత్యం చేస్తున్నాడు అని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇలా స్పైడర్‌మాన్‌గా అవతారం ఎత్తాడని చెప్పుకొచ్చాడు. యాదృచ్ఛికంగా, ఈ చిత్రం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్పైడర్ మాన్ : నో వే హోమ్' సమయంలోనే వచ్చింది. 
 
ఈ చిత్రం చుట్టూ ఉన్న మాస్ హిస్టీరియా, ఇప్పుడు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది, ఎందుకంటే ఈ చిత్రం దేశంలోని ప్రతి మూలలో, తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాక్ చేస్తోంది.  ఈ చిత్రంలో నేషనల్ క్రష్‌ వున్న రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించారు.

Spiderman celebrating his success dancing to "Rara Saami" from Pushpa! As a fan of AA & Spidey.. Waah! Yeh India hain boss. @SpiderMan good job buddy! pic.twitter.com/IGXdlfzsKv

— Allu Sirish (@AlluSirish) January 9, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు