తమిళ బిగ్ బాస్ షోలో శ్రీరెడ్డి..

శుక్రవారం, 31 మే 2019 (10:37 IST)
తమిళ బిగ్ బాస్ షోలో శ్రీరెడ్డి పాల్గొనబోతోందని కోలీవుడ్ టాక్. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పి.. అర్ధనగ్న ప్రదర్శన చేపట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌కు మకాం మార్చింది. 
 
తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఉండనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినీ లెజెండ్ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇక తాజాగా మూడో సీజన్ ప్రోమో విడుదలై, ఇప్పుడు తమిళ బుల్లితెర ప్రేక్షకులను ఊపేస్తోంది. ఇక ఈ షోలో శ్రీరెడ్డి పాల్గొంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని... కోలీవుడ్ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు