ముఖ్యంగా మహిళలే సీరియల్స్‌లో విలన్లు వుంటున్నారు. వారి పాత్రల డిజైన్ కూడా ఒకరకంగా క్రూరంగా వుంటుందనే చెప్పాలి. ఇటీవలే ఇంటిగుట్టు అనే సీరియల్‌లో అత్తగారు కోడలిని రాచిరంపాన పెట్టడం, అదికూడా ఐస్‌గడ్డలపై రోజంతా కోడలిని నిలుచోపెట్టడం వంటివి చూశాం. ఇప్పుడు ఆ కోడలును బయటకు పంపడానికి పోలీసు అధికారి అయిన తన కొడుకు కు ఆల్‌రెడీ పెల్లయి పిల్లాడు పుట్టాక వేరే వారితో వెళ్లిపోయిన మొదటి కోడలుకు జత కట్టాలని చూస్తుంటుంది. ఇలాంటి ఘోరాలు ఇందులో చాలానే వున్నాయి. పారిపోయి వచ్చిన ఆ అమ్మాయి ఇప్పుడు మాజీ భర్త అయిన పోలీసు అధికారి కి భార్యగా వున్న మరో అమ్మాయికి మానసికంగా నరకంగా చూపిస్తుంటుంది. అదెలా అనేది బుల్లితెరపై చూడాల్సిందే. పైగా దీనికి ముందుగానే ప్రోమో... ఆమె వెళ్ళగొట్టిందా! లేదా? అనే ప్రచారం కూడా చేస్తున్నారు.
ఒకటిగాదు రెండుకాదు. తెలుగు టీవీ పేరుతో పలు సీరియల్స్ అన్నీ ఇలాగే వున్నాయి. మరో సీరియల్‌లో రాజ వంశంకు చెందిన కథ. పెద్దకోడలు అత్తగారిని బామ్మగారికి, ఆఖరికి మామగారిని కూడా లెక్కచేయకుండా మాట్లాడడం. జిత్తుల మారి నక్కగా వ్యవహరించడం, మామగారిని స్లో పాయిజన్ ఇస్తూ, మరిదిని ఎంకరేజ్ చేస్తూ అతడితో ఎఫైర్ పెట్టుకోవడం. ఇలాంటివి రోజూ పరిపాటి అయ్యాయి. ఒక సీరియల్‌లో అత్తగారు విలన్ అయితే మరో సీరియల్‌లో కోడలు విలన్. ఇంకో సీరియల్‌లో తోబుట్టువే విలన్. మరో సీరియల్‌లో లేడీ ఫ్రెండ్ విలన్. ఇలా అన్నీ విలన్లు మగవారే చేస్తే ఇక పురుషులు డమ్మీగా మారిపోవడం సీరియల్స్‌లో కామన్ అయిపోయింది. ఇంకో సీరియల్‌లో.. భార్యగారూ అంటూ భర్త సంబోధించడం. కేవలం నలుగురికోసమే భర్త. అనేట్లుగా మాట్లాడడం.. ఇన్ని ఘోరాలు చూడలేకపోతున్నామంటూనే గతిలేక చాలామంది ఆడవాళ్ళు చూడడం జరుగుతునేవుంది.
తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా! ఇదే కావాలి. మీరు వచ్చారా! అవార్డు ఇచ్చారా! వెళ్ళారా! అంతవరకు మీ పని. అనడంతో ఆయనతోపాటు అక్కడివారు షాక్ అయ్యారు. దాంతో చిన్నబుచ్చుకున్న రాజీవ్ ఏదో ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇదీ ఛానల్స్ తీరు.. కనుకనే గతంలో పలువురు టీవీ సీరియల్స్‌కు సెన్సార్ వుండాలని పోరాటాలు కూడా చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. సో. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.