బాహుబలి ఫీవర్ అలానే కొనసాగించాలనుకుంటున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటివరకూ 1,2,3 పార్టులంటూ హాలీవుడ్ సినిమాలను తీయడం చూశాం. ఐతే తెలుగులో అలాంటి ఫార్ములాను ఫాలో అయ్యేందుకు ఎవ్వరూ సాహసం చేయలేదు. కానీ రాజమౌళి మాత్రం ఆ సాహసం చేసేశారు. నిజానికి బాహుబలి చిత్రాన్ని ఒక పార్టుగానే అనుకున్నప్పటికీ జక్కన్న ప్రతి సీనును చెక్కడంతో అది కాస్తా రెండో పార్టుకు వెళ్లింది.
ఇప్పుడు బాహుబలి 2 కంక్లూజన్ కాకుండా బాహుబలి 3 వరకూ తీసుకెళ్లాలని తేల్చే చెప్పారు. ఆ తర్వాత బాహుబలి 4, 5... అలా హారిపోటర్ మాదిరిగా సాగుతుందేమో చూద్దాం. మరి మాహిష్మతి రాజ్యంలో అన్ని కోణాలను పాత్రలను చూపించుకుంటూ వెళ్లాలనుకున్న రాజమౌళి బాహుబలి 3 చిత్రాన్ని చూసే ఓపిక తెలుగు ప్రేక్షకులు ఉందో లేదో బాహుబలి 2 మీద ఆధారపడి ఉంది.