తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత మోహన్ వడ్లపట్ల తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.