''బాహుబలి 2'' సినిమాలో 'కన్నా నిదురించరా..' అనే పాటలో అనుష్కతో పాటు ఆశ్రిత వేముగంటి మెరిసింది. దీంతో మమ్ముట్టి సరసన అవకాశాన్ని ఆశ్రిత కొల్లగొట్టింది. ఇక సబితా ఇంద్రారెడ్డి పాత్ర కోసం సినీనటి సుహాసినిని ఎంపిక చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సుహాసిని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకున్నారు.
ఆనందో బ్రహ్మ సినిమా ఫేమ్ దర్శకుడు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించే ఈ సినిమా 70 ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మితమవుతోంది. విజయ్ చిలలా, శశి దేవ్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇందులో వైకాపా వైఎస్.జగన్ సోదరిగా భూమిక నటించనున్నట్లు తెలుస్తోంది.