ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి బయోపిక్ వచ్చి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ 2019 సంక్రాంతి నాటికి దాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.