టాలీవుడ్లో యూత్ హీరోల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సుప్రసిద్ధ కెమెరామెన్ చోటా కే నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ తన ట్యాలెంట్‌తో వచ్చిన క్యారెక్టర్లకు చేసుకుంటూ పోతున్నాడు. హీరోగా సెటిల్ కావడానికి బాగా కష్టపడుతున్నాడు. 'ప్రస్థానం' సినిమాతో విలన్‌గా పరిచయమైన సందీప్ కిషన్ హీరోగా అప్ అండ్ డౌన్స్ చాలా చూసాడు.
మేనల్లుడికి బ్యాక్ అప్‌గా నాయుడు ఎంత ట్రై చేసిన వాళ్ళిద్దరూ కల గంటున్న డ్రీం హిట్ మాత్రం ఇంకా అందని ద్రాక్షాలాగే ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్ 'నక్షత్రం' మూవీలో చేస్తున్నాడు. రెజీనా హీరొయిన్, కృష్ణ వంశీ దర్శకుడు. ఇందులో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గెట్ అప్‌లో కనపడనున్నాడు సందీప్. మొదటిసారి తనిష్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇంకేముంది వచ్చిన వాళ్ళంతా ఆహా ఓహో అనటమే కాదు టేస్ట్ చాలా బాగుంది అంటూ సందీప్‌ని తెగ మెచ్చుకున్నారట. గతంలో కూడా శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున లాంటి వాళ్ళు సైతం ఇలా సక్సెస్ అందుకున్న వాళ్ళే. ఇప్పటికే సమంత, నితిన్ కలిసి హైదరాబాదులో ఓ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.