దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి, ప్రభాస్ - రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్‌లు కలిసి నటించిన చిత్రం బాహుబలి 2 : ది కంక్లూజన్. ఈ చిత్రం వచ్చే నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేసమయంలో ఈనెల 26వ తేదీన తెలుగు ఆడియోను విడుదల చేయనున్నారు.
కాగా, ఇటీవల విడుదలైన ఆ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా... యూ ట్యూబ్ వ్యూస్‌లో ఏ భారతీయ చిత్రం అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది.