'మహర్షి' కథను ముందుగా మహేష్‌బాబుకు చెప్పాలనుందని వంశీ అడగ్గా.. ఏదో 10 నిముషాలు విని వద్దులే అని చెబుదాం అనుకున్నాడట. కానీ వంశీ కథ చెప్పాక.. ఎక్సైట్ అయ్యాడు. అవ్వడమేకాకుండా కథ వింటుండగా అనుకోకుండా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. దాంతో మహేష్ అంతకుముందు వేరే సినిమా చేయాలనుకున్నది కూడా పక్కన పెట్టేసి.. వెంటనే వంశీకి డేట్స్ ఇచ్చేశాడు.
ఆ తర్వాత షూటింగ్ పూర్తయి.. డబ్బింగ్ చెబుతుండగా మరలా అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి ఒకటికి రెండు సార్లు డబ్బింగ్ సరిచూసుకుంటుండగానే భళ్ళున కళ్ళలోని నీరు వచ్చేశాయి. ఆ సీన్ డబ్బింగ్ కోసం బాగా కష్టపడ్డాడట. దాంతో అక్కడివారు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి, వారు కూడా ఫీలయ్యారట. వారే ఇంతగా ఫీలయితే మే 9వ తేదీన ప్రేక్షకుడుకూడా అలా కనెక్ట్ అవుతారని డబ్బింగ్ స్టూడియోవారే చెప్పారు. ఈ చిత్రం మానవీయకోణమున్న ప్రతి ఒక్కరినీ టచ్ చేస్తుందని మహేష్ చెప్పుకొచ్చాడు.