చెన్నై వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సోదరులు సూర్య, కార్తీ ఇద్దరూ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితుల కోసం సూర్య, కార్తీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నటీనటులు సూర్య, కార్తీ రూ. 10 లక్షలు ప్రకటించినట్లు పీఆర్వో మనోబాల విజయబాలన్ వెల్లడించారు.
ప్రస్తుతం సూర్య తన బ్లాక్‌బస్టర్ మూవీ కంగువతో బిజీగా ఉన్నాడు. ఇది శివ దర్శకత్వంలో, ఆది నారాయణ రాసిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్టూడియో బ్యానర్‌పై కె ఇ జ్ఞానవేల్ రాజా, వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీ ఇటీవల జపాన్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించాడు.