జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం వంటి హిలేరియస్, సోషల్ రెస్పాన్సబులిటీ కలిగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.