'వీరే ది వెడ్డింగ్' చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్‌లతో కలిసి స్వరా భాస్కర్ నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో ఆడుతోంది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
అలాగే, తెలుగులో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ప్రస్థానం చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, స్వరా భాస్కర్ కీలక పాత్రను పోషించనుంది.
ఈ నేపథ్యంలో తన జీవితంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటన గురించి మాట్లాడుతూ, ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించింది. ఓ నిర్మాత నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. తన వెనుక నిల్చుని 'ఐ లవ్ యూ బేబీ' అంటూ తనను తాకబోయాడని, తన చెవికి ముద్దు పెట్టడానికి యత్నించాడని తెలిపింది. ఇదంతా క్యాస్టింగ్ కౌచ్‌లో భాగమేనని వాపోయింది.