నిఖిల్ హీరోగా నటించిన ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమా కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. హారర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అవికాగోర్ గెస్ట్ రోల్ పోషించింది. ఈ రోల్ ద్వారా అవికాకు మంచి మార్కులే పడ్డాయి. మరో ఇద్దరు హీరోయిన్లు హెబ్బా పటేల్, నందిత శ్వేతలు కూడా అద్భుతంగా నటించారు. అయితే అవికాగోర్ రోల్‌లో కలర్స్ స్వాతి నటించాల్సింది. కానీ గెస్ట్ రోల్ కావడంతో వద్దని తిరస్కరించింది.
అవికా గోర్ ఆ పాత్రకు ఓకే చెప్పడం.. ఆ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభించడంతో ఎగిరిగంతేస్తోంది. హెబ్బా పటేల్, నందిత శ్వేత ఉన్నా.. వాళ్ళతో సమానంగా అవిక కూడా భేష్ అనిపించుకుంది. గతంలో కార్తికేయ సినిమా ద్వారా నిఖిల్‌తో స్వాతి కెమిస్ట్రీ పండిందని టాక్ సొంతం చేసుకుంది.