తాజాగా బాలీవుడ్ ఓ ఇంటర్వూలో తాప్సీ ఈ కామెంట్లు చేసింది. గతంలో షారూఖ్ ఖాన్ తో డంకీ సినిమాలో నటించింది. ఆ తర్వాత గత ఫిరాయి.., ఖేల్ ఖేల్ మే సినిమాలతో వచ్చింది. ఈ రెండూ డిజాస్టర్ వచ్చాయి. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న తాప్సీ పన్ను కు ఇప్పుడు అవకాశాలు పెద్దగాలేవు. తెలుగులో కూడా సినిమా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంలేదు.
తెలుగులో మంచు ఫ్యామిలీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ వారి బేనర్ లో కొన్ని సినిమాలు చేసింది. కొంతకాలం గేప్ తీసుకున్న ఆమె బాలీవుడ్ పై శ్రద్ధపెట్టింది. అయితే బాలీవుడ్ లో ఇప్పికే కంగనారనౌత్ కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్లు చేసింది. దాంతో ఆమెను కొద్దికాలం బేన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని తీసుకున్నట్లు తాప్సీ కామెంట్లు చేస్తుంది. ఇది ఆమె కెరీర్ కు ఎలావున్నా వ్యక్తిగతంగా తనకు జరిగిన అనుభవాలను చెప్పాను. ఇండస్ట్రీ ఇంకా మారలేదు. పాత పద్ధతిలోనే వుంది అంటూ చెప్పింది.