బధిర పాత్రలో మిల్కీ బ్యూటీ... చీకటి గదిలో తకధిమి తందానా..

శుక్రవారం, 17 మే 2019 (10:03 IST)
టాలీవుడ్ మిల్కీబ్యూటీ నటించిన బాలీవుడ్ చిత్రం ఖామోషీ. ఈ చిత్రం ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ భారీ అంచనాలనే పెంచేసింది. 
 
త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో చ‌క్రి తోలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లోనే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. ఈ చిత్రం మరో చిత్రానికి కాపీ అనే కామెంట్స్ లేకపోలేదు. 
 
ఇదే ఏమైనా ఈ చిత్రంలో బధిర పాత్రలో తమన్నా నటిస్తుంటే.. చీకటి గదిలో తీసిన సన్నివేశాల్లో ఈమె రెచ్చిపోయి రొమాన్స్ చేసిందట. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మూవీ మంచి హిట్ ఖాయ‌మ‌ని నెటిజ‌న్స్ స‌ర్టిఫికెట్స్ ఇస్తున్నారు. 
 
చిత్రంలో ప్ర‌భుదేవా, భూమిక‌, సంజ‌య్ సూరీ, ముర‌ళీ శ‌ర్మ‌ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. చిత్రంలో ప్ర‌భుదేవా సైకో పాత్ర‌లో క‌నిపించి బ‌య‌పెట్టించ‌నున్నాడు. హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా బాణీలు అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు