ముఖ్యంగా, హస్తానికి గుడ్‌బై చెప్పడానికి కారణం ఆ పార్టీ నడుస్తున్న తీరు సరిగా లేకపోవడమేనన్నారు. 'కాంగ్రెస్ పార్టీ మారిపోయింది, ఆ పార్టీలో నేతలు మారిపోయారు' అని వ్యాఖ్యానించారు. అంతకుమించి తన నిష్క్రమణకు గల కారణాలను వివరించలేనని తెలిపారు.
నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, కానీ గత నాలుగేళ్లుగా స్థానిక నేతలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నదీ చెబుతూనే ఉన్నానని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
'ముఖ్యంగా, నేను ఓ నటినే కావచ్చు. కానీ అళగిరి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి. నేను ప్రజలను ఆకర్షించగలను. అళగిరి నాలా జనాకర్షక శక్తి ఉన్న నేత కాదు. అందుకే, తమకంటే తెలివైన, వాక్పటిమ ఉన్న మహిళను ఈ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నించారు. విధేయత గురించి మాట్లాడడం ఇక వృథా. నాది గట్టి గుండె. నేను అందగత్తెనే కాదు, తెగువ ఉన్నదాన్ని కూడా" అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.