దాసరి నారాయణ రావు లేకపోయినప్పటికీ ఆయన వారసుడిగా దాసరికి చిరంజీవి రూపంలో ఓ ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. దాసరిలా చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుపోయే గుణం ఒక్క చిరంజీవిలోనే ఉందన్నారు. ఇటీవల దాసరిపై పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన 'తెర వెనుక దాసరి' పుస్తకంను స్వయంగా చిరు విడుదల చేయడమే కాకుండా, ఆ ఫంక్షన్‌కి అయిన ఖర్చంతా చిరునే భరించారని చెప్పారు.
ఇలాంటి గుణం ఒక్క దాసరిగారిలోనే ఉందన్నారు. అలాంటి గుణమే ఇప్పుడు నాకు చిరంజీవిలో కనిపిస్తోంది. ఆయన చాలా మెతక స్వభావి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. పైగా దాసరిలా అనుభవజ్ఙుడు. అలాంటి చిరంజీవి, దాసరిగారిలా పరిశ్రమని తన భుజాలపై వేసుకుని నడిపించగలడని నా అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.