Asian Taraka Rama Cineplex
ఒకప్పుడు దేవి శ్రీదేవి థియేటర్ లు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ఫేమస్. దాని పక్కనే తారక రామ ఉండేది. ఎన్ టి. ఆర్. నిర్మించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆడాయి. కాల క్రమంలో ఒక దశలో అశ్లీల చిత్రాలు ఆడుతుండేవి. దానితో థియేటర్ కు చెడ్డ పేరు వచ్చింది. కరోనా తర్వాత పూర్తిగా మూతపడింది. ఇప్పడు తారక రామ థియేటర్ పునరుద్ధరించబడింది. ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ గా పేరుతో ప్రారంభం కాబోతున్నది.