బాలయ్యపై అలేఖ్యా రెడ్డి పోస్టు వైరల్.. ఎవ్వరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు..

మంగళవారం, 14 మార్చి 2023 (11:24 IST)
Taraka Ratna
టాలీవుడ్ నటుడు తారకరత్న మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అతని మరణంతో కుంగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన భావోద్వేగ క్షణాలను తన అనుచరులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె నటుడు బాలకృష్ణపై ఎమోషనల్ నోట్ రాసింది. అలేఖ్యా రాసిన ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అలేఖ్యా రెడ్డి తన పోస్ట్‌లో "మంచి చెడు సమయాల్లో శిలలా నిలిచిన ఏకైక వ్యక్తి.. మిమ్మల్ని తండ్రిలా హాస్పిటల్‌కు తీసుకెళ్లడం నుండి, మీ పక్కన కూర్చోవడం వరకు. మీ పడక పక్కన, మీ కోసం తల్లిలా పాడుతూ.. మిమ్మల్ని ప్రతిస్పందించేలా చేయడానికి ఎన్నో చేశారు.. ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య" గారికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. మాతో జీవితాంతం వుంటారనుకుంటే.. అంతలోనే వదిలి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ తారకరత్నపై అలేఖ్యా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు