బిగ్ బాస్ రెండో సీజన్‌లో భాగంగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంటెస్టెంట్లలో తనీష్ ఒకడు. ఫైనల్ విజేతల్లో టాప్-3గా నిలబడి లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దీప్తి సునయన, సామ్రాట్, తేజస్వీలతో ఎక్కువగా ఉన్న తనీష్ మధ్యలో అందరితో కలిసి ప్రయత్నం చేశాడు. ఇక కౌశల్‌తో గొడవలు మాత్రం యథావిథిగా జరిగేవి.. మళ్లీ కలుసుకునేవారు.
తనీష్‌కు వాళ్ల అమ్మ అంటే ఎంత ఇష్టమో షోలో ఎన్నో సార్లు వివరించాడు. లావు తగ్గుతానని, కోపం తగ్గించుకుంటానని షోలోకి వచ్చేటప్పుడు మాటిచ్చాను అని అంటూ తనీష్ ఇంటి సభ్యులతో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇక తన తమ్ముల్లిద్దరి గురించి ఎంతో ప్రేమను కురిపించాడు