బీజేపీలోకి మాధవీలత- నెటిజన్ల ఫైర్.. నా క్యారెక్ట‌ర్ పోతుందా? అంటూ ప్రశ్న

సోమవారం, 7 మే 2018 (13:08 IST)
కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం హైదరాబాదులో పర్యటించారు. గడ్కరీ సమక్షంలో సినీ నటి మాధవీలత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ద్వారా ఫోటోలతో పాటు మాధవీలత పోస్టు చేసింది. కానీ అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది. సోషల్ మీడియాలో మాధవీలతను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బీజేపీలో మాధవీలత చేరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు హీరోయిన్‌గా క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేసిన మాధవీలత వున్నట్టుండి బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందని నెటిజన్లు అడుగుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మాధవీలత తనదైన శైలిలో స్పందించింది. 
 
సోషల్ మీడియాలో తాను బీజేపీలో చేరడంతో వచ్చిన కామెంట్స్ చదివాను. తప్పేమీ లేదు. నెటిజన్లలో కొందరికి నచ్చని పార్టీలో చేరితే తిడతారా? అంటూ ప్రశ్నించింది. మా కుటుంబంలో అమ్మానాన్న, అన్నలు, నేను.. మొత్తం ఐదు మంది. ఐదుగురు ఐదు పార్టీలకు చెందిన వాళ్లం ... ఎవరిష్టం వాళ్లది. ఒక్కొక్కరికీ ఒక్కో ఇష్టం.
 
పార్టీలో చేరినంత మాత్రాన ఇన్నాళ్ల నుంచి ఉన్న నా క్యారెక్ట‌ర్ పోతుందా? పుట్టి పెరిగిన ఇన్ని ఏళ్లలో నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఒక పార్టీ మార్చేస్తుందా? అంటూ మాధవీ లత ప్రశ్నించింది.  అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తన ఆలోచనల్లో మంచి చేయాలనే ఉద్దేశమే వుంటుందని.. వేరొకటి వుండదని మాధవీలత తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు