తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ మృతి.. అమెరికాలోనే అంత్యక్రియలు..

బుధవారం, 5 జులై 2017 (13:57 IST)
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) అమెరికాలో మృతి చెందారు. దీంతో తమ్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. తమ్మారెడ్డి కుమార్తె కుమారుడైన సాకేత్ మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు బుధవారం అమెరికాలోని వర్జీనియాలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
 
వర్జీనియాలో సాకేత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాకేత్ మరణవార్త విని ఆయన కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ లోకం షాక్‌కు గురైంది. సినీ ప్రముఖులంతా సాకేత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 
 
సాకేత్ అతి పిన్న వయస్సులోనే తిరిగి రాని లోకాలు చేరిపోవడంపై సన్నిహితులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన దివ్యభారతి 19వ ఏటనే మరణించింది. అలాగే సిల్క్ స్మిత 35వ ఏట, ఆర్తీ అగర్వాల్ 31వ సంవత్సరం, సౌందర్య 31వ ఏట, ప్రత్యూష 20వ ఏట, ఉదయ్ కిరణ్ 33వ ఏట, శ్రీహరి 49వ సంవత్సరం నాటికి ప్రాణాలు కోల్పోయారు. 
 
90 తారల్లో ఒకరైన ఫటాఫట్ జయలక్ష్మీ 22వ ఏట, సంగీత దర్శకుడు చక్రి 40వ ఏట మృతి చెందారు. యశోసాగర్ 25వ సంవత్సరంలో, చంద్రన్ రెడ్డి 36, కునాల్ సింగ్ 30వ వయస్సు నాటికి మరణించారు. వీరి సరసన ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన సాకేత్ రామ్ కూడా చేరిపోయాడు.

వెబ్దునియా పై చదవండి