Ramakrishna Goud, Mohan Goud, Gururaj, Yalamanchili Ravichander and others
గత నాలుగేళ్లుగా కౌన్సిల్ లో ఉన్న సభ్యులందరికీ జమ ఖర్చులు తెలియజేయకుండా, అలాగే రెండేళ్లకొకసారి పెట్టాల్సిన తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ నాలుగు సంవత్సరాలైనా కూడా నిర్వహించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని రామకృష్ణ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. దీనికోసం కౌన్సిల్ లోని కొంతమంది నిర్మాతలు (సభ్యులు ) హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో రిలే నిరాహరణ దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్, రామకృష్ణ గౌడ్, గురురాజ్, యలమంచిలి రవిచందర్, రవీంద్ర గోపాల్, మిత్తాన ఈశ్వర్, డి. వి. గోపాల్ రావు, బానూరి నాగరాజు, పి.వీరారెడ్డి, వరప్రసాద్ లతో అనేక మంది నిర్మాతలు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని మీడియా సమావేశంలో వారి ఆవేదనను తెలియజేశారు.