IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

సెల్వి

శనివారం, 18 అక్టోబరు 2025 (18:24 IST)
హాస్టల్ బాత్రూమ్‌లలో వీడియోలను రికార్డ్ చేశారనే ఆరోపణలతో 32 ఏళ్ల ఐఐటీ బాంబే మాజీ విద్యార్థిపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 12న హాస్టల్ 14లో ఈ సంఘటన జరిగింది. ఈ కేసులో కొందరు విద్యార్థులు సీనియర్‌ పట్టుకుని క్యాంపస్ సెక్యూరిటీకి అప్పగించారు. 
 
జూలై 2025లో ఎంటెక్ పూర్తి చేసిన ఆ పూర్వ విద్యార్థి అక్టోబర్ 11 నుండి తాత్కాలిక విజిటర్ పాస్‌పై క్యాంపస్‌లోకి ప్రవేశిస్తున్నాడు. తరచుగా క్యాంపస్‌కు వస్తుండేవాడని.. ఇందుకోసం ఇతర విద్యార్థుల ఐడీని ఉపయోగించుకున్నాడని తేలింది. 
 
పోలీసులు అతని ఫోన్‌లో ఇలాంటి అనేక వీడియోలను కనుగొన్నట్లు సమాచారం, అయితే ఇన్‌స్టిట్యూట్, అధికారులు విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి