థాంక్యూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న విడుదలైంది. లవ్ స్టోరీ తర్వాత హీరో నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. విక్రమ్ కే. కుమార్ తన గత చిత్రాల మాదిరిగానే క్లాసిక్ టచ్‌తో నిర్మించారు. నాగచైతన్యతోపాటు రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారులు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.