సినిమా మీద ప్యాషన్ తో డిస్ట్రిబ్యూటర్ గా జర్నీ స్టార్ట్ చేశారు మారుతి. మంచి రచన చేయగల సామర్థ్యం ఉన్న మారుతి ప్రేక్షకులకు ఒక మంచిని చెబుతూనే థియేటర్స్ కు వారిని ఆకర్షించగల కమర్షియల్ మీటర్ లో స్టోరీలు రెడీ చేసుకున్నారు. అలా గుడ్ సినిమా గ్రూప్ ను తన మిత్రులతో కలిసి స్థాపించి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈరోజుల్లో తెరకెక్కించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, చిన్న చిత్రాల్లో పెద్ద సక్సెస్ ను అందుకుంది. అక్కడి నుంచి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మారుతి ప్రస్థానం మొదలైంది. బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు మారుతి. మారుతి సినిమా అంటే అటు ప్రొడ్యూసర్స్ ఇటు ఆడియెన్స్ అది ఖచ్చితంగా మంచి మూవీనే అవుతుంది అనేంత నమ్మకాన్ని ఇచ్చారీ టాలెంటెడ్ డైరెక్టర్. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు డైరెక్టర్ మారుతి. మరోవైపు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తన మిత్రుడు ఎస్ కేఎన్ తో కలిసి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు.