రచయితలు తమ స్క్రిప్ట్ ను 250 పదాల నిడివిలో 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ రూపొందించారు. అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్ లను టాప్ ప్లేస్ లో ఉంచబోతున్నారు. తమ రచనకు వచ్చే రేటింగ్ రైటర్స్ కాన్ఫిడెన్స్ పెంచనుంది. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ మొదటి ప్రయత్నంగా రచయితలకు మీ ఫేవరేట్ హీరోకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లను ఇన్వైట్ చేస్తోంది.
ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ ద్వారా తమ కథలను రైటర్స్ ఆడియో బుక్స్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల తమ స్క్రిప్ట్ లను మరింత మందికి చేరువయ్యేలా రైటర్స్ చేసుకోవచ్చు.