ఈమధ్య సినిమా తీశాక థియేటర్లలో రిలీజ్ చేస్తే చూసేందుకు ప్రేక్షకుడు కానరావడంలేదు. ఏవో కొన్ని సినిమాలు మినహా చిన్న సినిమాలకు అస్సలు జనాలు లేక వెలవెల బోతున్నాయి. అందుకే సినిమా పరిశ్రమ బతకాలంటే దిల్ రాజు, మైత్రీమూవీస్ వంటి పెద్ద సంస్థలు, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి సంయుక్తంగా చర్చలు జరిపి థియేటర్ లో రెంటల్ సిస్టమ్ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు తెలియజేశారు. ఈరోజు వచ్చనవాడు గౌతమ్ సినిమా టీజర్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.