వేటూరి త‌ర్వాత సిరివెన్నెలే - శాస్త్రి లేనిదే మ‌హాన‌టి లేదు - ప్ర‌భాస్ సినిమా ప్ర‌శ్నార్థ‌కమే - అశ్వ‌నీద‌త్

మంగళవారం, 30 నవంబరు 2021 (19:21 IST)
Aswinidath-nag Aswin-sirivennala
సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణంతో మా మాట మూగ‌బోయింద‌ని ప్ర‌ముఖ నిర్మాత వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ పేర్కొన్నారు. ఆయ‌న‌తో గ‌ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
- ఈరోజు దుర్దినం.. తెలుగు సినిమాకే చాలా బాధాక‌రం. మా ఇద్ద‌రి ప‌రిచ‌యం ఈనాటిది కాదు. ఓ సీత‌క‌థ‌.కు పాట‌లు రాశారు.  సిరివెన్నెల సినిమాతో ఆయ‌న నాకు మంచి మిత్రుడుగా మారారు. ఆడ‌పా ద‌డ‌పా ఒక‌టో రెండో పాట‌లు రాసేవారు ఆయ‌న‌. అలాంటి టైంలో వేటూరి సుంద‌రామ్మూర్తిగారి మ‌ర‌ణంతో ఆయ‌న లోటును భ‌ర్తీచేసేలా పూర్తి పాట‌లు సీతారామ‌శాస్ర‌తిగారే రాసేవారు.
 
- తెలుగు సినిమా సాహిత్యం కోరుకునే ప్రేక్ష‌కుల‌కు, అభిరుచి గ‌ల నిర్మాత‌ల‌కు, ఆయ‌నే కావాల‌నుకునే ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న లేనిలోటు పూడ్చ‌లేనిది.
 
- ఇటీవ‌లే బెగ్గ‌ర్ సినిమాకు రెండు పాట‌లు రాశారు. మూడో పాట రాయాలి. నందిని రెడ్డి సినిమాకు ఒక పాట రాశారు. మ‌రో పాట రాయాలి. నాగ్ అశ్విన్‌కు సిరివెన్నెల కుడిశుజం. ఇప్పుడు ఆ భుజం ప‌డిపోయింది.
 
- ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ తీయ‌బోయే సినిమాకు ఐదు పాట‌లు ఆయ‌నే రాయాలి. ప‌లుసార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఆయ‌నే రాయాల‌నేది నాగి సంక‌ల్పం. మ‌హాన‌టి సినిమా ఆయ‌న‌ లేనిదే లేదు. అలాంటిది ఈరోజు నాగి వాయిస్ మూగ‌బోయింద‌నే చెప్పాలి.
 
- సీతారామశాస్త్రిని మ‌రిపించేలా ప్ర‌భాస్ సినిమాకు ఎవ‌రు రాస్తార‌నేది ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. కొద్దిరోజులు ఆయ‌న గురించే ఆలోచ‌న‌లు. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నా. మా కుటుంబం కూడా ఈ సంద‌ర్భంగా మూగ‌బోయింద‌ని చెప్ప‌డానికి బాధ‌గా వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు