సౌత్‌లో రెండు శకాలుంటే కమల్‌హాసన్‌కు ముందు ఆ తర్వాత - విక్టరీ వెంకటేష్
బుధవారం, 1 జూన్ 2022 (07:25 IST)
Kamal Haasan, Lokesh Kangaraj Venkatesh, Anirudh, Nitin, Sudhakar Reddy
`కమల్ చేసిన దశావతారం వంటి సాహసాన్ని మరే నటుడు చేయలేడు. `ఏక్ దూజేకెలియే` సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన గ్లోబర్ స్టార్ కూడా` అని విక్టరీ వెంకటేష్ అన్నారు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. జూన్ 3న విడుదలకానున్న'విక్రమ్ ప్రీరిలీజ్ వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన విక్రమ్: హిట్ లిస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ – కమల్‌గారి పదినారు వయదినిలే (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్»ౌల్డ్. ఆయన నటించిన మరో చరిత్ర ప్రతి యాక్టర్‌కు జీపీఎస్. దశావతారంలాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ఏక్ దూజే కేలియేతో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్‌గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు. అని అన్నారు.
చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ, విక్రమ్ ఇప్పుడు కంప్లీట్ ఫైనల్ మిక్సింగ్ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ వేడుకకు వచ్చిన వెంకటేస్‌కు, నితిన్‌ను థ్యాంక్స్. తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. నా మొదటి సినిమా నుంచి మీరు ప్రోత్సహిస్తున్నారు. విక్రమ్ కూడా అలానే చేస్తారని ఆశిస్తున్నాను. జూన్ 3న విడుదలవుతున్న ఈ సినిమాలో కమల్‌గారి అద్భుతమైన యాక్షన్‌ను మీరు చూస్తారు అన్నారు
సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ, కమల్ గారి లవ్ అండ్ ఎఫెక్షన్ సినిమాలోనూ కనిపిస్తుంది. విక్రమ్‌లో నేపథ్యసంగీతం కథపరంగా హైలైట్ కానుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. కమల్ సార్‌కు థ్యాంక్‌యూ.`అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, కమల్ సార్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆయన విక్రమ్ సినిమాలో పాటలు రాసే అదృష్ట నాకు దక్కింది. ఆయన యాక్షన్, నటన కొలమానాలు లేనివి. ఆయన మరింత ఉజ్వలంగా వెలగాలని కోరుకుంటున్నాను అన్నారు.
నితిన్ మాట్లాడుతూ, కమల్‌హాసన్‌గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఆయన మాస్టర్ పీస్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ విడుదలచేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఎ.ఆర్. రెహమాన్ తర్వాత నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు అనిరుద్. లాస్ట్ వీక్ వెంకీమామ ఎఫ్3తో సూపర్ హిట్ కొట్టారు. జూన్3న తెలుగులో విడుదలచేస్తున్న మా విక్రమ్ కు ఆ హిట్ ను మాకూ అందించాలని చమత్కరించారు.
వెంకీ కుడుముల మాట్లాడుతూ, కమల్‌సార్ మాకు ఆదర్శం. ఆయన ముందు మాట్లాడే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. మాచర్ల నియోజకవర్గం వల్ల వచ్చింది. నితిన్‌కు థ్యాంక్స్. వెంకటేష్‌గారికి థ్యాంక్స్. విక్రమ్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
శైలేష్ కొలను మాట్లాడుతూ, చిన్నప్పటినుంచి కమల్‌సార్ సినిమాలు చూసి పెరిగాను. అపూర్వ సహోదరులు చూశాక ఎంతో నేర్చుకుననాను. హే రామ్ చూశాక నేను ఫిలిం మేకింగ్‌ను అర్థం చేసుకోవాలని ఆలోచన వచ్చింది. అందుకే ఈ రంగంలోకి వచ్చాను. స్టూడెంట్స్‌కు విక్రమ్ గైడ్ ఎలాంటిదో హే రామ్ ఔత్సాహిక దర్శకులకు అలాంటిది. రచనలోకూడా నాకు ఆదర్శం. నా కొడుకుకు అభయ్ అనే పేరు పెట్టుకున్నాను. ఇలా మీ ముందు మాట్లాడే అవకాశం కలిగినందుకు చెప్పలేని ఆనందం కలిగింది అన్నారు.