ఈ సినిమాలో అభిమన్యు సింగ్ నటన చాలా బాగుందని, ఎంతో ప్రత్యేకంగా ఉందని ప్రేక్షకులు మాట్లాడం విశేషం. ఈ సందర్భంగా నటుడు అభిమన్యు.. ఎంపురాన్ సినిమాలోని తన పాత్రను ప్రజలు ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞుడిని తెలిపారు. దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఒక నటుడికి ఇంతకంటే ఎక్కువ ఏమీ కావాలి అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అభిమన్యు సింగ్ ప్రస్తుతం 'OG' చిత్రంలో నటిస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా అభిమన్యు విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యూలర్ విలన్ లా కాకుండా 'OG'లో తన పాత్ర సరికొత్తగా ఉంటుందని చెప్పాడు. "ఈ పాత్రకు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. పాత్ర ప్రారంభం ఎంత భిన్నంగా మొదలౌతుందో అంతే భిన్నంగా ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ పాత్రను తెరమీద చేస్తున్న ప్రేక్షకులు కొన్నిసార్లు ద్వేషిస్తారు, కొన్నిసార్లు ఇష్టపడతారు అన్నారు. అలాగే డైరెక్టర్ సుజిత్ ఒక మంచి విజన్ ఉన్న దర్శకుడు అని పేర్కొన్నారు. ఓజీ సినిమా చాలా బాగా రూపొందుతుందని పవన్ కల్యాణ్ తో రెండోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఓజీతో పాటు "ఆమిర్ ఖాన్ నిర్మాణంలో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో 'లాహోర్ 1947' అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రం. ఈ మూవీలో కూడా చాలా భిన్నమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు కను విందుగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను అని అభిమన్యు అంటున్నారు.
'దేవర' చిత్రంలో కూడా విలన్‌గా మంచి పేరు వచ్చింది. 'నేను నా రాక్షసి' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ నటుడు, తెరపై అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. "తెలుగు సినిమాలో అన్ని మంచి పాత్రలే చేశారు. ఈ సందర్భంగా ప్రతీ సినిమా తనకు కొత్త సినిమే అని, నిజానికి తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ఇంకా చాలా దూరం వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ పాత్ర తనకు ఛాలెంజ్ అని, ఏ పాత్ర చేసినా నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. నటన అనేది కేవలం రెండు సంవత్సరాల్లో పరిపూర్ణంగా సాధించే విషయం కాదు. నటన ఒక కళ, కొన్నిసార్లు జీవితకాలం సరిపోదు సంపూర్ణంగా చేయడానికి అని తెలిపారు.
ఇప్పుడు సినిమా చాలా మారిందని ప్రపంచ సిినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారని, అందుకే ప్రతీ సారి ఒకేలా చేస్తే కుదరదు అని అభిమన్యు సింగ్ అంటున్నారు. పాత్రకు తగ్గట్లు ఒదిగిపోవడం నేర్చుకున్న నటులే ఎక్కువకాలం ఈ పరిశ్రమలో రాణిస్తారు అని చెప్పారు. ప్రస్తుతం విలన్ పాత్రలో పాటు కొన్ని కీలకమైన పాత్రలు చేస్తున్నట్లు.. ఏదానికి అదే ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని అభిమన్యు సింగ్ చెప్పారు. విలన్ గా ఎన్ని సార్లు తెరమీద కనిపించినా ప్రేక్షకులకు బోర్ కొట్టకపోవడానికి కారణం ఆయన తీసుకునే జాగ్రత్తలే అని అభిమన్యు సింగ్ వెల్లడించారు.